కోరుట్ల

రక్తదాన సంధానకర్త, కటుకం గణేష్ కు ఘన సన్మానం

viswatelangana.com

March 11th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ కు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు తీసుకున్న సందర్భంగా కోరుట్లలోని శ్రీ నారాయణ స్కూల్ లో నిర్వహించిన ఒక కార్య క్రమంలో స్కూల్ యజమాన్యం కరస్పాండెంట్ జ్యోతిర్మయి చేతుల మీదుగా అవార్డు గ్రహీత, ప్రాణదాత కటుకం గణేష్ కు ఘన సన్మానం చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి కోరుట్ల మరియు చుట్టుపక్కల గ్రామాలలో ఎవరికి అవసరం ఉన్న అత్యవసర సమయంలో రక్తాన్ని అందించడంలో ముందంజలో ఉన్న కటుకం గణేష్ ధన్యజీవి అని పలువురు అభినందించారు. కోరుట్ల ప్రాంతంలో 2007 సంవత్సరంలో రక్తదాన ఉద్యమం ప్రారంభించి, నేటికీ 17 సంవత్సరాలలో 4250 మంది రక్తదాతలతో రక్తాన్ని ఇప్పించిన కటుకం గణేష్ అభినందనీయుడని వారు పేర్కొన్నారు. ఒకప్పుడు రక్తం దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని, ఇప్పుడు గత 17 సంవత్సరాల నుండి సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త, ప్రాణదాత కటుకం గణేష్ రక్తదానం ఉద్యమాన్ని ప్రారంభించిన నుండి కోరుట్ల ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో రక్తదానానికి కొదవ లేకుండా చూస్తున్న వ్యక్తి కటుకం గణేష్ అని వారు ప్రశంసించారు. ముందు భవిష్యత్తులో మరెంతో మందికి రక్తాన్ని అందించి, ప్రాణాలను కాపాడి, ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను చేపట్టి ఇంకా మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పిన్నం చెట్టి జ్యోతిర్మయి, పిన్నంశెట్టి శ్రీనివాస్, శ్రీహర్ష, శ్రీ వాస్తవ్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button