రాయికల్
రజిత పాదుకల సమర్పణ

viswatelangana.com
April 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామి వారికి మాలావత్ వెంకటేష్ దంపతులు శనివారం రజిత పాదుకలు సమర్పించారు. ఈ సందర్భంగా పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధృడసంకల్పం జపం, యోగసాధన, ఆహార నియమాలు, సద్గురువు బోధనలు పాటించడం వలన సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు. అనంతరం దీక్షా స్వాములకు భిక్ష అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గోవిందుల శ్రీనివాస్, కట్కాపూర్, దావన్ పల్లి గ్రామాల ఆంజనేయస్వామి మాలధారణ భక్తులు పాల్గొన్నారు.



