రాజకీయపరంగా బీసీలు ఐక్యంగా ఉండాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక పిఎన్ఆర్ గార్డెన్లో శుక్రవారం రోజున జరిగిన అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస పాల్గొని మాట్లాడుతూ. ఇటీవల 100 రోజుల క్రితం తెలంగాణలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు రాజకీయంగా ప్రజా పాలన కొనసాగాలని అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని బలంగా నమ్మి నియోజకవర్గంలో నా గెలుపు కోసం కృషి చేసిన యాదవ సోదరులను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు.ప్రజా పాలన వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన మాట ప్రకారం చక్కటి సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా వంటి పథకాలను అమలు చేసుకున్నాం, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలనలో రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను నాటినుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ పాలనలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా అభివృద్ధికి తోడ్పడుతున్నామని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగనల ద్వారా బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. రాజకీయపరంగా బీసీలందరూ ఐక్యంగా ఉండి దొరల గడీలను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు.భీమారం మేడిపల్లి మండల కేంద్రాలలో యాదవ సంఘం భవన నిర్మాణాలకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ ఉపాధ్యక్షుడు రాజేంద్ర యాదవ్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు రమేష్ యాదవ్, టిపిసిసి అధికార ప్రతినిధి బాస వేణు గోపాల్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముఖేష్ యాదవ్, పిసిసి నెంబర్ అంజయ్య, జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్, ఎన్ఆర్ఐ సమాజ సేవకుడు దేవ్ యాదవ్, టిపిసిసి సోషల్ మీడియా మనోజ్ యాదవ్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి అదే లక్ష్మీరాజం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ రాజశేఖర్, భీమారం, మేడిపల్లి మండలాల యాదవ సంఘం అధ్యక్షులు రెబ్బాస్ మల్లయ్య , అదే రమేష్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బండ మల్లేశం, కథలాపురం మండల ప్రెసిడెంట్ ఆశన్న, కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి, భీమారం మండలాల అధ్యక్షులు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, మేడిపల్లి, భీమారం మండలాల యాదవ కులస్తులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



