viswatelangana.com
Date of Publish : 11 April 2025, 2:24 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రాజీవ్ యువ వికాసం గడువును పొడగించాలి

రాజీవ్ యువ వికాసం గడువును పొడిగించాలని ఎం జె ఎఫ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపల్లి లక్ష్మణ్, కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, బెక్కెం అశోక్, లు కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీసేవ లలో దరఖాస్తు చేసు కునేవారికి కులం, ఆదాయం, సరైన సమయానికి అందక పోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొందరి వద్ద కులం సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ ఈ సంవత్సరంకు సంబంధించి ఆదాయం సర్టిఫికెట్ లేకపోవడంతో సర్టిఫికెట్లు తీసేసరికి కొంత ఇబ్బందికి గురవుతున్నారని, ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ 6 కోట్ల రుణాలను 60- 80%, వరకు రాయితీతో ఇవ్వనుంది. అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు, ఆదాయ సర్టిఫికెట్ ఆధార్, కుల, ధ్రువీకరణ పత్రం ఫోటో అవసరం ఉన్నదని ప్రభుత్వం పేర్కొంది.

Change News Type