రాయికల్
శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామి రథోత్సవం

viswatelangana.com
March 9th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ పంచముఖ లింగేశ్వర స్వామి (త్రికుటాలయం)లో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రోజున రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథంలో శివపార్వతుల ఉత్సవాలను ఉంచి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, వార్డ్ కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



