భీమారంమేడిపల్లివేములవాడ

అలుపెరుగని నేత – ఎన్నికలు ముగిసిన జనం బాట

viswatelangana.com

May 15th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
వేములవాడ (విశ్వతెలంగాణ) :

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గత రెండు నెలల పాటు విరామం లేకుండా నిత్యం పదుల సంఖ్యలో గ్రామాలు తిరుగుతూ అర్ధరాత్రి వేళలో ఇంటికి చేరేవాడు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి కదా. ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు అనుకుంటే పొరపాటే. ఎన్నికలు ఉన్న లేకున్నా ప్రతినిత్యం జనం కోసం ఆరట పడే జననేతగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆది శ్రీనివాస్. సోమవారం ఎన్నికల పోలింగ్ ముగియడంతో మంగళవారం ఉదయాన్నే భీమారం, మేడిపల్లి మండలాల్లో పలు గ్రామాలను తిరుగుతూ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరారు. దీంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనితీరును చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలు ముగిసిన విశ్రాంతి లేకుండా జనాల కోసం ఆరాటపడుతున్నాడని, విరామం లేకుండా జనం కోసం పాటుపడుతున్నడని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి జననేత, కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడు దొరకడం వేములవాడ నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు.

Related Articles

Back to top button