రాజ్యాధికార సాధనే లక్ష్యంగా యాదవులందరం ముందుకు సాగుదాం -మల్లేష్ యాదవ్

viswatelangana.com
రాజ్యాధికార సాధనే లక్ష్యంగా యాదవులందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. మెట్ పల్లి మండలం రాజేశ్వర్ రావ్ పేటలో గ్రామ యాదవ సంఘ సమావేశాన్ని నిర్వహించి సభ్యత్వాలతో సంఘ బలోపేతం, యాదవుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు అనంతరం రాజేశ్వర్ రావ్ పేట గ్రామ యాదవ సంఘ సభ్యులు మొత్తం 27 మంది యాదవులు సభ్యత్వం తీసుకోగ వారికి జిల్లా కార్యవర్గ సభ్యుడు తొట్ల చిన్నయ్య యాదవ్ ఇంచార్జీలు తిప్పణవేణి రవి యాదవ్,అంకం శంకర్ యాదవ్,గుండెల నాగేష్ యాదవ్,పంతంగి రాజేందర్ యాదవ్ లతో కలిసి సభ్యత్వ రసీదులను అందించిన జిల్లా అధ్యక్షుడు మల్లేష్ యాదవ్.. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ సభ్యులుఎర్రగొల్ల బాలరాజ్ యాదవ్, ఎర్రగొల్ల మల్లేష్ యాదవ్, పెండేల చిన్న శ్రీను యాదవ్, దానవేణి మహేష్ యాదవ్, ప్రకాష్ యాదవ్, రమేష్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు..



