రామాజీపేట్ ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ నియామకం
viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట్ గ్రామంలో శనివారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల వేణు ఆధ్వర్యంలో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జగిత్యాల డివిజన్ అధ్యక్షులు నక్క సతీష్ మాదిగ హాజరై మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ను గ్రామ గ్రామాన బలోపేతం చేయడంలో భాగంగా గ్రామ కమిటీలు నియమించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులుగా కండ్లపెల్లి నరేష్ ఉపాధ్యక్షులుగా కండ్లపల్లి సాయికుమార్ ప్రధాన కార్యదర్శిగా మారంపల్లి రాజశేఖర్ కార్యవర్గ సభ్యులుగా బెక్కెం మనోజ్ బెక్కం సుశాంత్ కండ్లపల్లి అనిల్ మారంపల్లి నరసయ్య లను నియమిస్తూ నియాకపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బెక్కెం వెంకటేష్ సీనియర్ నాయకులు పాలెపు బాలరాజు రాజు ప్రశాంత్ వినయ్ తదితరులు పాల్గొన్నారు



