viswatelangana.com
Date of Publish : 19 March 2025, 3:29 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రాయికల్,సారంగాపూర్ మండలాల్లో లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బొర్నపల్లి గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టుతున్న హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ దశలో ఉన్న పనులను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. నెల రోజుల లోపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇటిక్యాల గ్రామంలో 9 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను అధికారులతో కలిసి పరిశీలించి, నెల రోజుల వరకు త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అల్లిపూర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపడుతున్న పల్లె దవఖాన సబ్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించి,ఏప్రిల్ మొదటి వారంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.సారంగాపూర్ మండలం లచ్చక్క పేట గ్రామంలో చేపడుతున్న సిసి రోడ్ పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు.నాగునూర్ గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపడుతున్న పల్లె దవాఖాన నిర్మాణ దశలో ఉన్న పనులను పరిశీలించి, 2 నెలల లోపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు.హెల్త్ సబ్ సెంటర్లు, ఎన్ఆర్ఈజీఎస్ క్రింద చేపడుతున్న సిసి రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధు సుధను, డిఈ మిలిండు, ఎమ్మార్వో, ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Change News Type