రాయికల్
రాయికల్ తహసీల్దార్ కు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనసన్మానం
viswatelangana.com
January 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
గణతంత్ర దినోత్సవ ఉత్సవ వేడుకల్లో జగిత్యాల అవార్డుల ప్రధానోత్సవంలో కలెక్టర్ యాస్మిన్ భాషా చేతుల మీదుగా ఉత్తమ తహసిల్దార్ అవార్డు ప్రశంసా పత్రం అందుకున్న రాయికల్ తహసిల్దార్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం కు శనివారం లయన్స్ క్లబ్ సభ్యులు మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ మీ అందరి అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మీ అందరి సహకారం వాళ్లే నాకు ఉత్తమ తహసిల్దార్ అవార్డు ప్రశంసా పత్రం వచ్చిందని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కొమ్ముల ఆది రెడ్డి, జెడ్ సి కాటిపల్లి రామిరెడ్డి, కోశాధికారి గంట్యాల ప్రవీణ్, లయన్స్ సభ్యులు మచ్చ శేఖర్ కడకుంట్ల నరేష్ బొమ్మకంటి నవీన్, కొత్తపెల్లి రంజిత్ కుమార్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.



