రాయికల్
రాయికల్ పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు

viswatelangana.com
June 10th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ అభివృద్ధి కి ప్రత్యేకంగా 15 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించునందున జగిత్యాల శాసనసభ సభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు, వీలైనంత త్వరగా టెండర్ ప్రక్రియ ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు, అనంతరం మోర హనుమాండ్లు మాట్లాడుతూ 15 కోట్ల నిధులతో రాయికల్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఏఎంసీచైర్మన్ గన్నే రాజారెడ్డి లు పాల్గొన్నారు.



