రాయికల్ పొచమ్మ గుడి ముందర అక్రమ నిర్మాణం తక్షణమే తొలగించి మత సామరస్యతను కాపాడాలి

viswatelangana.com
- పట్టణ ప్రజలు కుల సంఘాలు హిందూ ధార్మిక సంస్థలు నిరసనతో రాయికల్ మున్సిపల్ కమీషనర్ కు రాష్ట్ర జిల్లా ఉన్నతాధికారులకు పిర్యాధు.
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని పోచమ్మ గుడి ముందర వేరే మతానికి చెందిన ఒక వ్యక్తి ఈ-పేపర్ రిపోర్టర్ దస్తావెజు లేఖరి వీటిని ఆసరాగా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేస్తున్నాడని పోచమ్మ గుడి బాత్ రూముపై ఇంటి నిర్మాణం చేస్తున్నాడని ఇది సరియైన నిర్ణయం కాదని పట్టణ ప్రజలు కుల సంఘాలు హిందూ ధార్మిక సంస్థలు గుడి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిరసనగా వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదు లో పేర్కొన్న వివరాలు తెలియజేశారు. హిందువుల ఆరాధ్యదైవం అయిన గ్రామ దేవత ఊరిని కాపాడే పోచమ్మ అమ్మవారికి మేము ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతీ సంవత్సరం పోచమ్మ కు మొక్కులు తీర్చుకుని మా యొక్క వ్యవసాయ పనులు పెండ్లి పనులు అన్ని శుభకార్యాలు చేస్తుంటామని ఈ అమ్మవారి ఆలయం వద్ద డప్పుచప్పుల్లతో మొక్కులు చెల్లిస్తున్నప్పుడు చాలా మందికి పూనకాలు అమ్మవారి రూపంలో వచ్చి పోచమ్మ గుడి చుట్టు వేప కొమ్మలతో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో పసుపు కుంకుమ కల్లు వెదజల్లుతారని ఇవన్నీ ఆ ఇంటిపై పడే అవకాశం వుందని మతపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని మేము మా ఆచార వ్యవహారాల ప్రకారం కోళ్ళు మేకలు బలి ఇచ్చినప్పుడు కూడా ఆ ఇంటిపై రక్తం పడే అవకాశం వుందనీ సాంప్రదాయం ప్రకారం ప్రతీ రోజు ఉదయం మేలుకొలుపు సుప్రభాత సేవ లో భాగంగా మైకులో భక్తి పాటలు వేయడం జరుగుతుందనీ గతంలో వరంగల్ లో ఈ మధ్యన హోళీ పండుగ సమయంలో హిందువులపై జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఇక్కడ కూడా అటువంటివి జరుగరానివి జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారనీ మోఖా పరిశీలన చేయాల్సిన సంబంధిత మున్సిపల్ అధికారులు పరిశీలించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందనీ కావున ఇవన్ని పరిశీలిస్తే మతసామరస్యానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడి భవిష్యత్తులో ఇరు వర్గాల మధ్యన మతపరమైన గొడవలు చెలరేగే ప్రమాదం వున్నుందున ఇట్టి విషయాలను గ్రహించి భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఇట్టి అక్రమ పర్మీషన్ రద్దుచేసి అక్రమ నిర్మాణం తక్షణమే తొలగించి మత సామరస్యతను కాపాడాలనీ రాయికల్ మున్సిపల్ కమీషనర్ కు సమర్పించిన ఫిర్యాదు పేర్కొన్నట్లు ఇట్టి ఫిర్యాదు ప్రతులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి సియండిఎ రాష్ట్ర కమీషనర్ కు జిల్లా కలెక్టర్ కు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లకు కూడా పంపినట్లు రాయికల్ పట్టణ హిందూ ప్రజలు కుల సంఘాల బాధ్యులు హిందూ ధార్మిక సంస్థలు సంయుక్తంగా తెలిపాయి.



