viswatelangana.com
Date of Publish : 17 June 2025, 12:48 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రాయికల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలనీ, గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలనీ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. రాయికల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివరాలు, స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని సంబంధిత పోలీస్ సిబ్బందికి సూచించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని,బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, ప్రజలతో సత్సంబంధాలను మెరుగు పరచుకుంటూ ప్రజలకు, యువతకు ప్రత్యేకంగా, షీ టీమ్స్, ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులను మోసం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా గా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరు కృషి చేయాలని, సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా విధులు నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టి కి తీసుకొని రావాలి అని సూచించారు. వీరి వెంట ఎస్.ఐ.సుదీర్ రావు,ఏ ఎస్సై దేవేందర్, సిబ్బంది ఉన్నారు.

Change News Type