రాయికల్
రాయికల్ మండల ఆర్ఎంపి పి.ఎం.పి ఆధ్వర్యం లో నివాళులు

viswatelangana.com
April 24th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జమ్మూ కాశ్మీర్ పహాల్గం లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర వాదుల దాడిలో అమరులైన యాత్రికుల మృతికి సంతాపంగా రాయికల్ మండల ఆర్ఎంపి పి.ఎం.పి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చెలిమెల మల్లేశం మాట్లాడుతూ 20మందికి పైగా మృతి చెందడం చాలా బాధాకరం. అలాగే కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రొట్టె శ్రీధర్ ,క్యాషియర్ మహ్మద్ సమీర్,గౌరవ అధ్యక్షులు కట్కాం శ్రీనివాస్, గౌరవ సలహా దారులు పిప్పోజి మహేందర్ బాబు, కార్యవర్గ సభ్యులు బైరీ సుకేశ్, ఎంఏ అస్లాం, దాసరి గంగాధర్, కట్కం శివకుమార్, పారిపెల్లి మహేష్,రొండ్ల రాజేశం, మోర శంకర్, వెంకటస్వామి, రామకృష్ణ, మామిడాల రాజేష్, బొమ్మకంటి అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



