స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ సీజన్ 4

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఇటిక్యాల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయికల్ మండల క్రికెట్ సీజన్ 4 టోర్నమెంట్ బుధవారం రోజున మాజీ ఎంపీపీ కాటిపెల్లి గంగారెడ్డి టాస్ వేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందుండాలని, టోర్నమెంటుకు సహకరించిన దాతలు అందరికీ ధన్యవాదములు తెలిపారు.ఈ టోర్నమెంట్ కు విన్నర్ రన్నర్ కు దాతలుగా నిలిచిన కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు దాతలుగా వేల్పుల లక్ష్మణ్, హరీష్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ కాటిపల్లి నారాయణరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖర్, కల్లెడ వేణు, ఆర్గనైజర్లుగా గోపిడి రాజు, జావుడం రాకేష్, మంత్రి వినయ్, పెండం చంద్రశేఖర్, మరియు రాయికల్ మండల క్రికెట్ టీమ్స్, యువకులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



