కథలాపూర్
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఊట్ పల్లి యువకుడు

viswatelangana.com
October 28th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధి ఊట్ పల్లి గ్రామానికి చెందిన మొరపు గంగారెడ్డి-తుక్కమ్మ కుమారుడుమొరపు మధు ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా పాఠశాలల స్థాయి క్రీడా పోటీలలో 17 ఏళ్లలోపు బాలురు విభాగంలో పోటీల్లో ప్రతిభ చాటాడు ఈనెల 28 నుంచి గోదావరిఖనిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఊట్ పల్లి వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు ముదాం ప్రవీణ్ ఉపాధ్యక్షులు సాగర్ క్యాషియర్ నవీన్, ప్రమోద్, ప్రశాంత్, రతీష్, అజయ్ వినయ్, జీవన్ గంగరాజం మరియు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు మహేందర్, శ్రీనివాస్, అశోక్, నరేందర్, మహేష్, మహేష్ నవీన్ ప్రవీణ్ ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు



