కోరుట్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను విభజించి పాలిస్తున్నది వార్డు కౌన్సిలర్ మాడవెని నరేష్

viswatelangana.com
September 30th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
మున్సిపల్ జనరల్ పండ్ నిధులు అన్ని వార్డులకు సమానంగా కేటాయించక పోవడంపై మున్సిపల్ కౌన్సిలర్ మాడవేణి నరేష్, మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ ప్రజా పాలన అంటే ప్రజలందరికీ సమానంగా ఉండాలని, కేవలం అధికార పక్షానికి నిధులు కేటాయించి, ప్రతిపక్షాలకు మొండి చేయి చూపారని, ఈ ప్రభుత్వము ప్రజలని విభజించి పాలిస్తున్నదని, అన్ని వార్డులకు సమాన నిధులు కేటాయించక కేవలం అధికార పక్షానికి నిధులు కేటాయించి, మిగతా వార్డులో గెలిచిన ప్రతిపక్ష నాయకుల వార్డులకు నిధులు కేటాయించకపోవడంపై ధ్వజమెత్తారు. తదనంతరం ప్రతిపక్ష వార్డు కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపల్ ఆవరణలో నిరసన చేసారు.



