viswatelangana.com
Date of Publish : 13 June 2024, 4:17 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్య పుస్తకాల పంపిణీకి బ్రేక్. బుక్స్ వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ కొత్త గందరగోళానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల్లో అధికారులు, ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు వాటితో పాటు వర్క్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పుస్తకాల్లో ప్రచురణకు సంబంధించి కొత్త వివాదం తలెత్తింది. పుస్తకాల్లోని మొదటి పేజీలో ఉండే ముందుమాట మార్చుకుండానే విద్యాశాఖ పుస్తకాలను ముద్రించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ విషయం కాస్త వివాదాస్పదం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాల పంపిణీని నిలిపివేసి, ఇప్పటి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను కూడా వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆయా జిల్లాల డీఈవోలకు సమాచారం అందజేసింది

Change News Type