కోరుట్ల

రాష్ట్ర స్థాయి అబాకస్ పరీక్షల్లో రైసింగ్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ

viswatelangana.com

February 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్ ప్రయివేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అబాకస్ పరీక్షల్లో 170 పాఠశాలలకు చెందిన 400 వందల మంది విద్యార్థులు పాల్గొనగా జూనియర్ లెవెల్లో రైసింగ్ స్కూల్ విద్యార్థిని మంద గంగోత్రి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకును కైవసం చేసుకుని మరోసారి తన ప్రతిభను చాటుకుంది.ఈ సందర్భంగా రైసింగ్ స్కూల్ కరెస్పాండెంట్ కుడేల రాజేంద్రప్రసాద్ మంద గంగోత్రిని అభినందించి మాట్లాడుతూ మా రైసింగ్ స్కూల్ విద్యార్థులు అబాకస్ పోటీ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం మాకు చాలా ఆనందాన్ని కలిగించిందని ఇదే విధంగా మా విద్యార్థులు మునుముందు సైతం జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించాలనీ ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన విద్యార్థిని మంద గంగోత్రీని విశ్వం ఎడ్యుటెక్ వ్యవస్థాపకులు ప్రసాద్,ట్రస్మా రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ యాదగిరి శేఖర్ రావులు ప్రశంస పత్రము, మెమోంటోలచే సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు కుడేల లిఖిత, శహనాజ్,మోహన్ ఉపాధ్యాయులు వెన్నెల, సుమయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button