రాయికల్
రాష్ట్ర స్థాయి సి.ఎం.కప్ పోటీలకు అల్లిపూర్ విద్యార్థిని.

viswatelangana.com
December 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
డిసెంబర్ 19వ తేదీన జగిత్యాల లోని వివేకానంద మినీ స్టేడియం లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా మహిళల షాట్ పుట్ విభాగంలో ప్రథమ స్థానం సాధించిన అల్లీ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టీ.అనుష రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి శేఖర్, పిడి. కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎంపికైన విద్యార్థినిని ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అభినందించారు.



