కథలాపూర్
రుణ మాఫీ పట్ల ప్రభుత్వ తీరుపై నల్ల బట్ట కట్టుకుని నిరసన తెలిపిన రైతులు

viswatelangana.com
September 2nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో రెండులక్షల రూపాయలు, ఆ పైన ఉన్న రైతులకు రుణ మాఫీ చెయ్యకపోగా, కనీసం ఇప్పుడయినా రెండు లక్షలు ఆ పైన అప్పు ఉన్న వారికి ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేదని, కనీసం గ్రామాల్లోకి వచ్చిన నోడల్ అధికారులు అప్లికేషన్ కూడా తీసుకుని ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదని నల్ల బట్టలు కట్టుకుని రైతులు నిరసన వ్యక్తం చేశారు.



