viswatelangana.com
Date of Publish : 06 June 2025, 1:18 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రెవెన్యూ సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్,దావన్ పెల్లి గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భూ సమస్యలపై అధికారులు స్వీకరిస్తున్న దరఖాస్తులను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ….. భూభారతి చట్టం ద్వారా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, తహశీల్దార్ నాగార్జున, ఆర్ఐ పద్మయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type