కొడిమ్యాల

ఆలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

viswatelangana.com

February 3rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని వడ్రంగి వీధిలో గల పురాతన హనుమాన్ దేవాలయమునకు ఆలయ అభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కంచర్ల రాజమురళి, గౌరవ అధ్యక్షులు అంకం జనార్ధన్, ఉపాధ్యక్షులు ఒడ్నాల గంగమల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొండూరి సురేష్, సహాయ కార్యదర్శి బల్ల చిన్న అంజయ్య, కోశాధికారి కంచర్ల రామస్వామి, సలహాదారులు కార్యవర్గ సభ్యులు గా జగిడి దేవరెడ్డి, చింతల రవి, కంచర్ల బ్రహ్మచారి, ఉదారం వెంకటస్వామి, బైరి ప్రశాంత్, కొత్తూరి స్వామి వీరంతా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు ఈ సందర్భంగా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఈ పురాతన ఆంజనేయ స్వామి ఆలయ కమిటీకి ఎన్నికైనందుకు భగవంతుని సేవగా భావించి అభివృద్ధి చేస్తామని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.

Related Articles

Back to top button