viswatelangana.com
Date of Publish : 26 August 2024, 10:48 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రెస్టారెంట్ లలో ఆకస్మిక తనిఖీలు కుళ్లిన ఆహారపదార్థాలు స్వాధీనం

కోరుట్ల పట్టణంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ అలాగే మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు పట్టణ ప్రజల ఫిర్యాదుల మేరకు పట్టణంలో పలు రెస్టారెంట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు అలాగే కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను స్వాధీన పరుచుకొని, అట్టి కుళ్ళిన ఆహార పదార్థాలను డంపింగ్ యార్డ్ లో గుంత తీసి పూడ్చడం జరిగింది. అలాగే పరిశుభ్రత పాటించని యజమానులకు 32 వేల రూపాయలు జరిమానాలు విధించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి గారు మాట్లాడుతూ… పట్టణంలో రెస్టారెంట్ లు నిర్వహించే యజమానులు ప్రస్తుత వర్షాకాలంను దృష్టిలో ఉంచుకొని, అంటూ వ్యాధులు ప్రబలకుండా, పరిశుభ్రతను పాటించాలని, నాణ్యమైన, పరిశుభ్రమైన తాజా ఆహారాన్ని మాత్రమే ప్రజలకు విక్రయించాలని అలాగే నాణ్యత ప్రమాణాలను పాటించాలని తెలియజేయడం జరిగింది. లేనిపక్షంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు విధించడంతోపాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని తెలిపారు… ఈ తనిఖీలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్ అలాగే మున్సిపల్ సిబ్బంది జగ్గల్ల రమేష్, సానిటర్ జవాన్ లు చిట్యాల గంగరాజo, చిట్యాల రమేష్ , చిట్యాల రాజ్ కుమార్ పాల్గొనడం జరిగింది.

Change News Type