రైతుబంధు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశము

viswatelangana.com
రాయికల్ సహకార సంఘం లో రైతు బంధు ప్రత్యేక జనరల్ బాడీ సమావేశముకు ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి బి.వాణి సీనియర్ ఇన్స్పెక్టర్ యం.స్వప్న మరియు సంఘ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈయొక్క కార్యక్రమములో వివిధ గ్రామాలకు చెందిన రైతులు ప్రభుత్వం ద్వారా పొందే రైతు పెట్టుబడి సాయం కొంత మంది రైతులు 5 ఎకరాల వరకు మరియు కొంత మంది రైతులు కనీసం 25 ఎకరాల వరకు పంట సాగు చేసే భూములకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించిన సన్న రకాల వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఈ ఒక్క సన్న రకానికి కాకుండా అన్ని రకాలు అయిన సన్న, దొడ్డు రకాల వరి ధాన్యాలకు ఇవ్వాలని కోరాతు తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో పాక్స్ వైస్ చైర్మన్ బేతి మోహన్ రెడ్డి, డైరెక్టర్స్ కుర్మ రాము, కైరం రమణ, కొల్ల నారాయణ, పాలడుగు నరహింహ రెడ్డి, గుండ నరేష్, భేతి లక్ష్మి, మండల వసంత, బోడ భూమరాజం, సీఈఓ ఎలిగిటి రవికుమార్, ఇంచార్జీ సీఈఓ జగదీష్, మరియు సంఘ సిబ్బంది, రైతులు తదితులు పాల్గొన్నారు



