రాయికల్
నేటి నుంచి పోచమ్మ గుడి లో విగ్రహం ప్రతిష్టాపన ఉత్సవాలు

viswatelangana.com
April 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని ఒడ్డెలింగాపూర్ గ్రామంలో నిర్మితమైన పోచమ్మ ఆలయంలో శనివారం నుంచి పోచమ్మ పోతురాజు బలిపీఠం సారలమ్మ నీరలమ్మ ప్రతిష్ట ఉత్సవాలు ప్రారంభం అవుతాయని గ్రామ తాజా మాజీ సర్పంచ్ పాలకుర్తి రవి నాయకులు అను పురం రాజన్న సింగిల్ విండో డైరెక్టర్ నాగుల మల్లయ్య యాచమనేని దీపక్ రావు గడ్డంరాజారెడ్డి తెలిపారు. పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేములవాడ వేదపండితులు కె.రాజేంధర్ శర్మ పర్యవేక్షణలో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలోభాగంగా విగ్రహాల ఊరేగింపు జలాధివాసం ఫలపుష్పాధివాసం హోమం తదితర ప్రత్యేక పూజలు జరుగుతాయని వివరించారు.



