viswatelangana.com
Date of Publish : 08 April 2025, 3:51 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రైతు నేస్తం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ శాస్త్రవేత్తలు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు రైతు వేదిక లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. మట్టి పరీక్షల ప్రాముఖ్యత,మట్టి తీయు పద్ధతులు,వేసవిలో పూల మొక్కలు సాగుగురించి శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. మట్టి పరీక్షల గురించి ఇతర సందేహాలను వెల్మల రామిరెడ్డి అను రైతు అడిగి తెలుసుకోవడం జరిగినది.జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలతోఅడిగి తెలుసుకునే అవకాశం కలదు.దీనిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రాజేష్,శ్రీలత,గ్రీష్మ, రైతులు పాల్గొన్నారు.

Change News Type