viswatelangana.com
Date of Publish : 04 February 2025, 4:50 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి

జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందారు. జగిత్యాల జిల్లా డి సి ఆర్ బి లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కొక్కుల శ్వేత గొల్లపల్లి వైపు నుండి జగిత్యాల వస్తుండగా చిల్వకోడూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎస్సై శ్వేత తో పాటు బైక్ పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీలను జగిత్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.డీసీఆర్‌బీ జగిత్యాలలో పని చేస్తున్న ఎస్‌ఐ శ్వేత.. గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్‌, పెగడపల్లి ఎస్‌ఐగా పని చేశారు.

Change News Type