కథలాపూర్
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
April 11th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో 2000- 2001 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ మధురమైన అనుభవాలు గుర్తు తెచ్చుకొని ఆనాటి ఉపాధ్యాయులు విద్యార్థినిలు విద్యార్థులు కలిసి ఆటపాటలతో చదివిన జడ్పీహెచ్ఎస్ కథలాపూర్ పాఠశాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు భూమాచారి, శశిధర్, శ్రీనివాస్, గంగాధర్, రాజయ్య, అంజయ్య, అఖీల్ అహ్మద్, అహ్మద్ పాషా, గోపాల్ రెడ్డి, హాజరైన విద్యార్థులు సాయి రెడ్డి, జీవన్, రవి, గంగాధర్, ప్రసాద్, రాజేంధర్, గంగ మహేష్, స్వప్న, జమున, మేఘమాల, కవిత తదితరులు పాల్గొన్నారు.



