కొడిమ్యాల
లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయమునకు కొడిమ్యల వాస్తవ్యులు

viswatelangana.com
March 17th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని చెన్న వసుంధర (కీ”శే” చెన్న లక్ష్మీనారాయణ) కుమారుడు సాయి రాజ్, కూతురు శృతిల, కుటుంబం సభ్యులు, కీ” శే” లక్ష్మీనారాయణ, జ్ఞాపకార్థం ఆలయానికి శాశ్వత చందా దారులుగా 25,116=00/-(ఇరువై అయిదు వేల నూట పదహారు) ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయానికి ధన రూపేనా సహకరించిన దాతలకు అర్చకులు నాగరాజు రమేష్ తీర్థ ప్రసాదములు అందజేసి స్వామివారి మంగళ శాసనములతో ఆశీర్వదించారు. ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి సహకరించిన దాతల కుటుంబానికి నిర్మాణ కమిటీ,భక్తులు,గ్రామస్తుల తరఫున ప్రత్యేక (ఆత్మీయ మిత్రులకు స్వామివారి అనేక అనేక మంగళ శాసనములు తెలియజేశారు



