Local
లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు రెండు వారాల రిమాండ్. తీహార్ జైలుకు కవిత తరలింపు

viswatelangana.com
March 26th, 2024
Local (విశ్వతెలంగాణ) :
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను.. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో తీహార్ జైలుకు తరలించారు అధికారులు. కాగా, కవిత విజ్ఞప్తి మేరకు జైల్లో వెసులుబాటు కల్పించింది కోర్టు. కవిత విజ్ఞప్తి మేరకు జైల్లో వెసులుబాటు కల్పిస్తూ తీహార్ జైలు సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇంటి భోజనం తెచ్చుకునేందుకు కవితకు అనుమతి ఇచ్చింది కోర్టు. అలాగే కవిత పడుకోవడానికి మంచం, పరుపులు, దుప్పట్లు, వేసుకోవడానికి చెప్పులు, దుస్తులు, చదువుకునేందుకు పుస్తకాలు స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.



