మెట్ పల్లి

వడగళ్ల వాన వల్ల మెట్పల్లి మండలంలో ఇటీవల నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

viswatelangana.com

March 27th, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను పరమాశిస్తున్న కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్.మెట్పల్లి మండలంలోని పలు గ్రామాలలో సోమవారం రోజున వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వము ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తూ ఏ ఎస్ ఆర్ తండా మరియు రంగారావుపేట మెట్ల చిట్టాపూర్ తదితర గ్రామాలలో వడగళ్ల వాన వల్ల నష్టపైన రైతు కుటుంబాలను ఆయన పరామర్శించి రైతులను ధైర్యంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేసినారు ఏ ఎస్ ఆర్ తండాలో ఆరబెట్టిన ధాన్యంపై కవర్లు కప్పినప్పటికీ వడగళ్ల వాన వల్ల తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు వరి పొలాల్లో ధాన్యము రాలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జిల్లా మంత్రి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గజ్జెల్లి రాజగణేష్ మరియు సిహెచ్ నరసింహ గారు చందు, ఎండి షాదుల్లా, ఫిరోజ్ ఖాన్, సిద్దు, రైతులు గంగులోతు మార్వార్, గంగులోతు కర్ణ, జి ప్రభాకర్, జి బాపులాల్, జై రమేష్, జి తిరుపతి, దాసు, గంగాధర్, గంగుల గంగ భూమయ్య, బుచ్చి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button