రాయికల్
పాఠశాల కు కంప్యూటర్ అందజేత
viswatelangana.com
January 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలం ఇటిక్యాల ఉన్నతపాఠశాల కు గ్రామానికి చెందిన సాయప్ప చారిటబుల్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హిమవంతరావు విరాళంగా ఇచ్చిన కంప్యూటర్ ను మాజీ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ శనివారం ప్రధానోపాధ్యాయులు శ్రీ యస్.సదాశివ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు వేణు, చంద్రకంటి రవీందర్ పాఠశాల ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ ఎద్దండి రమేష్ శాంతకుమారి జియావోద్దీన్ పి.హన్మాంతరావు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు



