కొడిమ్యాల
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

viswatelangana.com
April 18th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లి అప్పారావుపేట గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలనువ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గడ్డం జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మి లబ్ధి పొందాలన్నారు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. సెంటర్లలో అవసరమైన అన్నిరకాలమౌలిక వసతులను ఏర్పాటు చేయాలనిసూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించి రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిలువేరి నారాయణ గౌడ్. గోగురి మహీపాల్ రెడ్డి. బండ రవీందర్ రెడ్డి. సామనపల్లి రమేష్.బండ నరసింహ రెడ్డి. నాగభూషణ్ రెడ్డి. గట్ల మల్లారెడ్డి. నేరెళ్ల బాలయ్య. ఇన్చార్జి ఏపిఎం అంకం పద్మ. వివోఏలు సుజాత. మౌనిక, రైతులు పాల్గొన్నారు.



