మేడిపల్లి
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు

viswatelangana.com
May 28th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
నకిలీ, కల్తీ విత్తనాలు రైతులకు విక్రయిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, పిడి యాక్ట్ అమలు చేస్తామని మేడిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ అన్నారు. మంగళవారం రోజున మండల వ్యవసాయ అధికారితో కలిసి మేడిపల్లి మండల కేంద్రంలో గల విత్తన అమ్మక దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నాసిరకం విత్తనాలు అమ్మిన, నకిలీ రసాయనక ఎరువులు అమ్మిన, నకిలీ దందా చేస్తున్నట్లు తెలిసిన కఠినమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు.



