రాయికల్

అందుల కోసం విరాళాలు అందజేత

viswatelangana.com

March 10th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కి కొద్ది రోజుల క్రితం సోచ్ ఫౌండేషన్ వారు వచ్చి ప్రార్థన సమయంలో వారి సంస్థ గురించి కొన్ని విషయాలు విద్యార్థులకు చెప్పి వారు త్వరలో హైదరాబాదులో అందులకు వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాం అని తెలియజేశారు. దీనికి కావలసిన సహాయ సహకారం విద్యార్థుల నుంచి ఆశించారు. తదనంతరం పాఠశాల డైరెక్టర్ జూపల్లి తిరుపతి రావు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు సమాజసేవ మరియు వ్యక్తిత్వం చాలా అవసరమని సమాజంలో ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సేవ చేసే గుణం పెంపొందించుకోవాలి అని విద్యార్థులకు ఉపదేశించారు. ఈ విషయాన్ని అనుసరించి 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు గల విద్యార్థులు నుండి వచ్చిన మొత్తం 1,17,328 రూపాయలు సోచ్ ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు. ఈ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఇంతటి విరాళాన్ని అందజేయడానికి తోడ్పడిన పాఠశాల యాజమాన్యానికి మరియు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను అభినందించి వారికి ప్రశంసా పత్రాలు, మెడల్స్, మరియు మెమొంటో లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జే తిరుపతి రావు, ప్రిన్సిపాల్ జే వేణుగోపాల్ రావు, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button