రాయికల్
విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాలు

viswatelangana.com
December 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా విగ్రహాల ఊరేగింపు, పుణ్యాహావాచనం, అఖండ దీపారాధన, అగ్ని స్థాపన, వాస్తు, యోగిని, నవగ్రహ, క్షేత్రపాలక, సర్వతో భద్ర మండలం జలాధివాసం తదితర పూజాకార్యక్రమాలు పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ వేదపండితులు గోసంగారి మహదేవ్ శర్మ, శ్రీధర రాజశేఖర్, గుండయ్య శర్మ, గోవిందుల శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అనుపురం శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ధరావత్ ప్రభాకర్, ఆలయ చైర్మన్ వోరుగంటి భూమా రావు, నాయకులు వోరుగంటి మోహన్ రావు, ముద్దం రమేష్, పిప్పరి జనార్దన్, ముంజం సాయికిరణ్, అల్లెపు నర్సయ్య, కదుర్ల రవి, కండ్ల పెల్లినర్సయ్య, కడ రాజేందర్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.



