అంగరంగ వైభవంగా రథోత్సవం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా శుక్రవారం రోజున రథోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండుగ జరిగింది.వేద పండితులు కళ్యాణాచార్యులు ఆలయ అర్చకులు జగన్మోహన్ ఆచార్యులు, చిలకమర్రి రఘునాథ ఆచార్యులు, ప్రత్యేక పూజలు అర్చనలు చేసి స్వామివారిని రథంపై కూర్చోబెట్టి పురవీధుల గుండా తిరుగుచు అందరికీ దర్శన భాగ్యం కలిగించారు. వెంకటేశ్వర భజన మండలి వారిచే భజన కీర్తనలను ఆలకించి, అందరిని ఆకట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన వ్యవస్థాపకులు వంశి వర్ధన్ రావు, విష్ణువర్ధన్ రావు, ఆలయ కమిటీ సభ్యులు బోడగం మల్లన్న, సుర కంటి నాగిరెడ్డి, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్, నేరెళ్ల లక్ష్మయ్య, గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, ప్రజాపతినిధులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.



