రాయికల్
విదార్ధులకు నైతిక విలువలపై అవగాహన కార్యక్రమం

viswatelangana.com
September 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేటర్ గంపా నాగేశ్వర్ రావు ఇంపాక్ట్ సదస్సులో ఉత్తమ ట్రైనర్ అవార్డు గ్రహిత వ్యక్తిత్వ వికాస నిపుణులు సుధీర్ వి అర్ డి పర్సనాలిటీ డెవలప్మెంట్, నైతిక విలువలపై విదార్థులకు చక్కని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు సుదీర్, ప్రధానోపాద్యాయురాలు ఉమ్మెంతల వెంకటరమణి, తాజా మాజీ చైర్మన్ జక్కుల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, మహేష్, సురేష్, వేణు, సంజీవ్, హుస్సేన్, రాజగోపాల్, శంకరయ్య, కమరుద్దీన్, పుష్పలత, శైలజ, సరోజిని మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



