రాయికల్

విద్యతో పాటు యువత క్రీడారంగల్లో రాణించాలి

viswatelangana.com

August 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

విద్యతో పాటు క్రీడా రంగాల్లో విద్యార్థులు, యువత రాణించాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు అడ్వకేట్ మచ్చ శేఖర్ అన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులు పారిపెల్లి గంగాధర్, బత్తిని భూమయ్య, ఆకు రాజేందర్ లను ఘనంగా సన్మానించి వాలీబాల్ యువ క్రీడాకారులకు రెండు వాలీబాల్ లను అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ… యువత, విద్యార్థులకు చదువుతోపాటు వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు గ్రామీణ క్రీడలు ఎంతో దోహద పడతాయన్నారు. గ్రామీణ క్రీడాకారులను గుర్తించి క్రీడలపై అవగాహన కల్పించి ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. క్రీడాకారులను తయారు చేసి జిల్లా, రాష్ట్రస్థాయిలో రాణించేలా తీర్చిదిద్ది రాయికల్ మండలానికి పేరు తేవాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఒత్తిడి నుండి దూరం చేసి ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ జడ్సి మ్యాకల రమేష్, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్, బాస్కెట్ బాల్ రాష్ట్రస్థాయి క్రీడాకారులు లయన్స్ వాసం ప్రసాద్, దాసరి గంగాధర్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రమేష్, ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర్ శర్మ, గంగరాజం, లక్కడి రాజారెడ్డి, వాలీబాల్ క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button