రాయికల్
విద్యార్థులకు వ్యాస రచన ఉపన్యాస పోటీలు

viswatelangana.com
February 13th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల భాష దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు గురువారం నిర్వహించారు. సరోజినీనాయుడు జన్మదిన సందర్బంగా ఆమె ఫొటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. సరోజిని నాయుడు జీవిత చరిత్ర పై విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వేముల మధు, ఆంగ్ల ఉపాధ్యాయులు కొండూరి రజనీకాంత్, సిద్దె గంగారాజం, రాపర్తి నర్సయ్య లు పాల్గొన్నారు.



