viswatelangana.com
Date of Publish : 14 March 2025, 2:43 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలి

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లి పూర్ గ్రామంలో గల మహాత్మ జ్యోతి పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో వీడ్కోలు వేడుక సంబరాలు గురువారం రోజున అర్ధరాత్రి వరకు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న కుమారి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని శ్రద్ధతో చదువుకొని క్రమశిక్షణతో జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. చెడు అలవాట్లకు మరియు సామాజిక మాధ్యమాలకు అలవాటు పడకుండా వ్యసనాల పట్ల దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థుల చే ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల నూలరించాయి. ఈ కార్యక్రమంలో విజయేందర్, వినోద్, కృప సాగర్, ప్రేమ్ సాగర్, శ్రీనివాస్, పిటి రాజ్ కుమార్, గౌతమి, జమున, శిరీష, విద్యార్థులు పాల్గొన్నారు.

Change News Type