కోరుట్ల
విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు

viswatelangana.com
March 21st, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణానికి చెందిన స్థానిక రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బికాం చదువుతున్న విద్యార్థులకు మార్చి 10 నుండి 21 వ తేదీ వరకు 11 రోజులపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఫైనాన్షియల్ అకౌంటింగ్ స్కిల్స్ గురించి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ జెన్పాక్ట్ వారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రకాల నైపుణ్యాలు పెంచుకొని అధునాతన టెక్నాలజీ సహాయంతో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించ వచ్చని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జన్పాక్ట్ కంపెనీ నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు తేజ్ బహదూర్, అన్షుమాన్, కళాశాల డైరెక్టర్ గాడి పెళ్లి హరిప్రియ అంజయ్య గౌడ్, ప్రిన్సిపల్ బెజ్జరపు ప్రవీణ్ కుమార్ మరియు అధ్యాపకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.



