రాయికల్

విద్యార్థులు వేసవి సెలవులను కళా నైపుణ్యం కు వినియోగించుకోవాలి

viswatelangana.com

April 23rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

వేసవి సెలవులను చదువుతో పాటు, కళా నైపుణ్యం కోసం సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.నరేందర్ అన్నారు. రాయికల్ మండలంలోని రామాజిపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్య వార్షిక ప్రణాళిక పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతూ 6నుండి9 తరగతుల విద్యార్థుల్లో ప్రథమ,ద్వితీయ శ్రేణి మార్కులు సాధించిన విద్యార్థి విద్యార్థులను మెడల్స్ అందించి సన్మానించారు. అలాగే రెగ్యులర్ గా పాఠశాలకు హాజరైన విద్యార్థులను, ఇంగ్లీష్, పోషణ పక్వడ్ పోటీ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నరేందర్ మాట్లాడుతూ వేసవి సెలవులను విద్యార్థులు మంచిగా సద్వినియోగం చేసుకోవాలని, టీవీ,సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలనీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, వేసవి కాలంలో బావుల వెంట వెళ్లకుండా,ఎండల్లో తిరగకుండా చూడాలని ఆయన అన్నారు. వ్యక్తిగత శుభ్రత తో పాటు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వేసవిలో విద్యార్థులు సమయం వృథా చేయకుండా మంచి పనులకు సద్వినియోగం చేసు కోవా లని ఆయన అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వాసరి రవి, ఉపాద్యాయులు లక్ష్మీకాంతం, రమేష్, విజయ్ కుమార్, కిరణ్, రమ,జ్యోతి, యశోద, ప్రతాప్ రెడ్డి,విద్యార్థులు, తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button