viswatelangana.com
Date of Publish : 24 September 2024, 4:59 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
విద్యుత్ అధికారుల పొలం బాట

కోరుట్ల పట్టణంలోని విలీన గ్రామం యెకీన్ పూర్ లో విద్యుత్ అధికారులు పొలం బాట నిర్వహించారు. మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఓల్టేజీ హెచ్చుతగ్గులు అలాగే ట్రాన్స్ ఫార్మర్లపై ఓవర్ లోడ్ల గురించి అవగాహన కల్పించారు. కరెంట్ విషయంలో ఎలాంటి సమస్యలున్నా రైతులు అధికారుల దృష్టికి తేవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ ఆంజనేయరావు, లైనమెన్ తాస్లీమ్, మిగతా విద్యుత్ శాఖ సిబ్బంది అలాగే రైతులు పాల్గొన్నారు.

Change News Type