కథలాపూర్
అత్యవసర సమయంలో ప్లేట్ లెట్స్ రక్తదానం చేసిన సాయి తేజ

viswatelangana.com
October 1st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
రక్తదానం అంటే ప్రాణదానంగా భావించి సేవాదళ్ బ్లడ్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న అనేక రక్తదాన సేవా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల గాయత్రి ఆసుపత్రిలో జీ నర్సయ్య అనే వ్యక్తికి అత్యవసరంగా ప్లేట్ లెట్స్ అవసరమని సేవాదళ్ బ్లడ్ అసోసియేషన్ వారిని సంప్రదించగా వెంటనే స్పందించి గంభీర్ పూర్ గ్రామానికి చెందిన సాయి తేజకు విషయం తెలుపగా సాయి తేజ వెంటనే స్పందించి ప్లేట్ లెట్స్ రక్తదానం చేసి తన సేవా గుణాన్ని చాటుకున్నాడు ప్లేట్ లెట్స్ దానం చేసిన సాయి తేజ ను పేషంట్ బంధువులు గాయత్రి హాస్పిటల్ డాక్టర్స్ అభినందించడం జరిగింది ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరం ఉంటే సేవాదళ్ బ్లడ్ అసోసియేషన్ వారిని ఈ నెంబర్ 9949737304 లో సంప్రదించాలని సంస్థ వ్యవస్థాపకులు తెలిపారు



