కోరుట్ల
వివిధ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com
October 22nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు 10 లక్షల రూపాయలతో హనుమాన్ భజన మండప నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీపీ తోట నారాయణతో కలిసి శంకుస్థాపన చేసారు. అనంతరం గ్రామానికి చెందిన మేకల పోచయ్య కుమారుడు మేకల లక్ష్మణ్ రెండు లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. అలాగే గ్రామంలోని ఐకెపి, పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బాస చంద్రశేఖర్ సభ్యులు నరేందర్, మహేష్, శేఖర్, మాజీ సర్పంచ్ తోట లింగారెడ్డి, బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బాషా గంగారెడ్డి, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ కటకం రాజేష్, మాజీ ఉపసర్పంచ్ ముస్తఫా, మాజీ కోఆప్షన్ ఇబ్రహీం, నాయకులు గంగరాం, లింగారెడ్డి, తోట శేఖర్, తోట వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.



