రాయికల్

శబరిమల మహాపాదయాత్ర పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు

viswatelangana.com

December 7th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

శబరిమల మహాపాదయాత్ర పూర్తయిన సందర్బంగా జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం నుండి బయలుదేరిన అయ్యప్ప భక్తులు విజయవంతంగా తమ యాత్రను ముగించారు. ఈ మహాపాదయాత్రను ప్రతి ఏడాది శబరిమల ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు నిర్వహిస్తారు. ఈ యాత్రలో అయ్యప్ప భక్తులు కఠిన నియమాలను పాటిస్తూ, భక్తి, భవ్యతలతో ముందుకు సాగుతారు. రాయికల్ పట్టణం నుండి ప్రారంభమైన ఈ యాత్రలో భక్తులు పాల్గొన్నారు. 1250 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి, వారు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని,తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఐదోసారి దీక్షను ధరించిన రామాజీపేట గ్రామానికి చెందిన మామిడిపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ… ఆత్మీయత, ఆధ్యాత్మికతతో కూడిన ఈ యాత్ర భక్తుల జీవితాలలో ప్రాముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందనీ, ఈ మహాపాదయాత్ర సందర్భంగా భక్తులు అయ్యప్ప మాలలు ధరించి, కష్టనష్టాలను తట్టుకొని పాదయాత్ర కొనసాగించారనీ, ఈయాత్ర భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, ఆత్మానందం కలిగించిందని అన్నారు.

Related Articles

Back to top button