రాయికల్

విశ్వశాంతి హై స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

viswatelangana.com

September 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని స్థానిక విశ్వశాంతి హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులు అందరూ ఒక్కరోజు ఉపాధ్యాయ వృత్తిని గౌరవంగా నిర్వహించి, పిల్లలందరికీ ఎంతో ఉత్సాహంతో విద్యాబోధన చేసి వారి యొక్క అభిప్రాయాలు అలాగే ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పదనం గురించి తెలిపారు. ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ… గురుబ్రహ్మ, గురుర్విష్ణు, గురుదేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ’’.. ఈ ప్రపంచంలో గురువే సమస్తం. విద్యాబుద్ధులు నేర్పి.. పిల్లల ఎదుగుదలకు తోడ్పడే గురువులకు పిల్లలు ఏం చేసినా రుణం తీర్చుకోలేనిది. నాస్తి విద్యాసమంచక్షు విద్యకు గురుదక్షిణ. పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. అందుకే మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్యదేవోభవ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత అలాగే విద్యాన్వేష్ ఉపాధ్యాయులు రంజిత్, మహేష్, మనీషా, స్రవంతి, ఇందుజ,మమత పాల్గొన్నారు.

Related Articles

Back to top button