కోరుట్ల

విశ్వ శాంతి స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు

viswatelangana.com

April 14th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణం లోని విశ్వ శాంతి హై స్కూల్లో తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేసుకొని ఉన్నత చదువుల కోసం వెళుతున్నారని, ఇంటర్ మీడియట్ విద్య అనేది చాలా కఠినమైనదని విద్యార్థులు తల్లి దండ్రులను, గురువులను గౌరవిస్తూ కష్ట పడి కాకుండా ఇష్ట పడి చదుకోవాలని తల్లి దండ్రుల గురువుల పేరు నిలబెట్టాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు తమకు పాఠశాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ మేము ఎక్కడికి వెళ్లిన తాము విద్యాభ్యాసం చేసిన పాఠశాలను, గురువులను మర్చిపోమని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రములు ఆహుతులను అలరించాయి. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్ బ్రహ్మన్న శంకర్ శర్మ, ప్రధాన వక్త బట్టు హరి కృష్ణ, ప్రిన్సిపాల్ కిరణ్, డైరెక్టర్స్ పాలెపు రామ కృష్ణ శర్మ, చీటీ సత్యంరావు, గంగిశెట్టి కృష్ణ, కటుకం రాజేష్, ఉపాద్యాయిని, ఉపాధ్యాయులు అలాగే తల్లి దండ్రులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button